వింటేజ్ లుక్ లో బర్త్ డే హంగామా

ఇటలీలో ‘రాధేశ్యామ్’ సెట్ లో ప్రభాస్ బర్త్ డే

prabhas-Birthday Hungama
prabhas-Birthday Hungama

బాహుబలి.. సాహో చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్ స్టార్ కాస్తా ఆల్ ఇండియా స్టార్ అయ్యారు. దీంతో నుంచి సినిమా వస్తోందంటే దేశ వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ అవుతోంది.

ఇక ఆయన బర్త్ డే అంటే హంగామా మామూలుగా వుంటుందా? అదే జరిగింది. శుక్రవారం ప్రభాస్ తన 41వ పుట్టిన రోజు జరుపుకున్నారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్నప `రాధేశ్యామ్` చిత్ర షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ షూటింటో పాల్గొంటున్న ప్రభాస్ మూవీ సెట్ లో బర్త్ డే జరుపుకున్నారు.

టీమ్ ఓ భారీ కేక్ ని సిద్ధం చేసింది. దీనిపై `ఆగూరి డార్లింగ్ ప్రభాస్` అని రాసి వుంది. ఆగూరి అంటే శుభాకాంలు అని అర్థం అని తెలిసింది. పుట్టిన రోజు జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ప్రభాస్ వింటేజ్ లుక్ లో బ్రౌన్ జాకెట్ లో కనిపించాడు. బర్త్ డే తరువాత ప్రభాస్ ఇటలీలోని ఓ మ్యూజియంని సందర్శించాడు.

దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది.

రోమియో జూలియట్ తరహా ప్రేమకథా చిత్రం కావడం . ..  నాటి వాతావరణాన్ని తలపిస్తూ వింటేజ్ లుక్ లో షూటింగులో పాల్గొంటుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/