మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ప్రధాని మోడీ నివాళులు

PM Modi pays tributes to former PM Rajiv Gandhi on his death

న్యూఢిల్లీః నేడు దివంగత కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్థంతి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు నివాళులర్పించారు. మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ గారికి నా నివాళుల అంటూ ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి చిదంబర్, సచిన్ పైలట్ వంటి ఇతర నాయకులు కూడా ఢిల్లీలో మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.

కాగా, 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 1984లో 40 ఏళ్ల వయసులో పదవీ బాధ్యతలు చేపట్టారు. అత్యంత చిన్న వయసులో ప్రధాని అయ్యారు. డిసెంబర్ 2, 1989 వరకు భారతదేశ ప్రధానిగా పనిచేశారు. తమిళనాడు శ్రీపెరంబుదూర్ ఎన్నికల ర్యాలీకి వెళ్లిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) ఆత్మాహుతి దాడిలో మే 21, 1991లో మరణించారు.