మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు పీఎంఓ ట్వీట్‌ చేసింది. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్‌ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/