హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేశవరావు కన్నుమూత

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్‌ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా, జస్టిస్‌ పీ కేశవరావు మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ఆయన అందించిన న్యాయ సేవలను స్మరించుకున్నారు. జస్టిస్‌ కేశవరావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/