కీల‌క నిర్ణ‌యం తీసుకున్నఆమ్ ఆద్మీ పార్టీ

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల‌కు ఆమ్ ఆద్మీ పోటీ..కేజ్రీవాల్‌

అహ్మ‌దాబాద్‌: 2022లో జ‌రిగే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయ‌న అహ్మ‌దాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేజ్రీ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి జాతీయ పార్టీగా ఆవిర్భ‌వించింది. ఇటీవ‌ల సూర‌త్‌లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 27 సీట్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/