వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల ఫై చంద్రబాబు కామెంట్స్

chandrababu-slams-ysrcp

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాదించేందుకు ఇప్పటి నుండి కసరత్తులు మొదలుపెట్టారు. అందులో భాగంగా రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసారు. దీని పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇటీవల కర్నూలులో తాను నిర్వహించిన పర్యటనకు యువత, ప్రజల నుంచి విశేషరీతిలో స్పందన వచ్చిందని ఇది చూసి వైస్సార్సీపీ లో వణుకు పుట్టిందని అన్నారు.

అందుకే రాష్ట్రంలో 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చేశారని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైస్సార్సీపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆక్వా రంగానికి పునర్ వైభవం తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎలాంటి పరిమితుల్లేని రీతిలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని తెలిపారు. జోన్, నాన్ జోన్ విధానాలను ఎత్తివేసి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.