వదంతులు సృష్టిస్తే పిడి యాక్టు

డిజిపి గౌతం సవాంగ్‌ హెచ్చరిక

AP DGP Gautam Sawang
AP DGP Gautam Sawang

Amravati:: రాష్ట్రంలో హిందూ ఆల యాలపై వరుసగా జరిగిన సంఘటలను సాకుగా చూపి స్తూ, ఆలయాలు ఆపదలో ఉన్నయన్న వదంతులను రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి) గౌతం సవాంగ్‌ ఖండించారు.

ప్రభుత్వ ఆదేశాలతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భద్రతా చర్యలు తీసు కుంటున్నామని డిజిపి వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాల విధ్వంసానికి సంబంధించిన కేసుల వివరాలను ఆయన వెల్లడించారు.

ఇప్పటి వరకూ 44 ఆలయాల్లో ఘటనలకు సంబంధించి 29 కేసులు నమోదు చేసి, 80 మంది కరుడుగట్టిన అంతర్‌రాష్ట్ర నేరస్తులు, ముఠాలను అరెస్టు చేసినట్లు డీజీపి గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/