పిబిఎల్‌ ఫైనల్లో నార్త్‌ఈస్టర్న్‌ వారియర్స్‌

సెమీఫైనల్లో చెన్నైపై వారియర్స్‌ గెలుపు

North eastern warriors
North eastern warriors

హైదరాబాద్‌: ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పిబిఎల్‌) ఐదో సీజన్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మొదటి సెమీస్‌లో వారియర్స్‌ 3 -(-1) తేడాతో చెన్నై సూపర్‌స్టార్జ్‌ను చిత్తుచేసింది. దీంతో పిబిఎల్‌లో నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ జట్టు తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్‌ఈస్ట్‌ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి తొలిసారి తుదిపోరుకు చేరితే.. ట్రంప్‌ మ్యాచ్‌లోనూ ఓడిన చెన్నై మైనస్‌లోకి పడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లీ చూక్‌ కిమ్‌ జోడీ 15-12, 9-15, 15-14 తేడాతో సుమీత్‌ రెడ్డి జెస్సికాపై నెగ్గి వారియర్స్‌కు శుభారంభం అందించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో లీ చూక్‌ 15-12, 15-12తో టామీపై విజయం సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల డబుల్స్‌లో అవధె ఆటగాళ్లు బోడిన్‌ కృష్ణప్రసాద్‌ 15-13, 14-15, 15-10తో సుమీత్‌రెడ్డి ధ్రువ్‌ కపిల జంటకు షాకిచ్చారు. ఈ గెలుపుతో మ్యాచ్‌ వారియర్స్‌ సొంతమైంది.
అప్పటికే ఫలితం తేలడంతో మిగిలిన నామమాత్రమైన పురుషుల సింగిల్స్‌, మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లు నిర్వహించలేదు. శనివారం బెంగళూరు రాప్టర్స్‌, పుణె 7 ఏసెస్‌ మధ్య జరిగే సెమీస్‌ విజేతతో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ ఫైనల్లో తలపడనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/