పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న పవన్‌ వారాహి యాత్ర

రెండో రోజుకు చేరిన పవన్ వారాహి యాత్ర

pawan-kalyan-varahi-yatra-schedule

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల కార్యరంగంలోకి దిగారు. తన ప్రచార రథం వారాహిలో యాత్రను ప్రారంభించారు. నిన్న అన్నవరం ఆలయంలో సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయన తన వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగనుంది. ఈ నెల 23 వరకు తొలి విడత యాత్ర కొనసాగుతుంది. ఈ విడతలో 7 బహిరంగసభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఈరోజు పవన్ యాత్ర పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది.

ఈరోజు పవన్ యాత్ర షెడ్యూల్..

.ఉదయం 11 గంటలకు గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ లో జనవాణి కార్యక్రమం.
.మధ్యాహ్నం 12 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్ లో జనసేన వీర మహిళ విభాగం ప్రతినిధులతో సమావేశం.
.సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో నేత కార్మికులతో భేటీ.