స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్

bandi-sanjay-comments-on-cm-kcr

రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడం తగదంటూ..ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని అడిగినందుకు నోటీసులు పంపుతామనడంపై మండిపడ్డారు. సభలో చర్చ జరగాలని.. రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించాలంటేనే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా టీఆర్ఎస్ సర్కార్ కుట్ర చేస్తోందని.. అందుకు సహకరిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరోపక్క తాను ఏనాడూ స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని ఈటల ఆరోపించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేల హక్కులను స్పీకర్‌ కాపాడాలని ఆయన కోరారు.