జోరు వానలో విశాఖ గర్జన..

Visakha roar in heavy rain

‘మన విశాఖ-మన రాజధాని’ నినాదంతో శనివారం విశాఖపట్నంలో ‘విశాఖ గర్జన’ పేరుతో భారీ ర్యాలీ చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభంకానుంది. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టనున్నారు. ర్యాలీలో జేఏసీ నేతలతో పాటు వైస్సార్సీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. అయితే ప్రస్తుతం విశాఖ లో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.

ఈ జోరు వానలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో విశాఖలో గడిచిన కొన్ని రోజులుగా వర్సాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు వర్షం వచ్చినా విశాఖ గర్జన యధావిధిగా నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ముందస్తు వర్ష సూచన నేపథ్యంలో జేఏసీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. గొడుగులు, రెయిన్ కోట్లతో కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌ రోడ్‌లోని వైస్సార్‌ విగ్రహం వరకు వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు, అన్ని వర్గాల వారు దీనికి మద్ధతు పలకాలని జేఏసీ ప్రకటించడం జరిగింది.

ఇక రాష్ర్ట అభివృద్ధిలో మూడు రాజధానుల పాత్ర ఎంతో కీలకమనేది జగన్ ప్రభుత్వం భావన.. ఇప్పుటికే సంక్షేమంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీ ప్రభుత్వం.. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతోంది. రాష్ర్టంలోని ఒక ప్రాంతాన్ని కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని.. అది మూడు రాజధానుల ద్వారానే సాధ్యమవుతుందనేది జగన్ ప్రభుత్వం అంటుంది. అందుకే విశాఖ గర్జన కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.