నెగెటివ్ వచ్చినా బయటకు రాని పవన్.. అందుకేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, అందుకే తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్లు పవన్ ఇటీవల తెలిపాడు. అయితే కొద్ది రోజుల్లోనే పవన్‌కు కరోనా టెస్ట్ రిపోర్టులో నెగెటివ్ అని తేలిందని ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో పవన్ తిరిగి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుని సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటారని అందరూ అనుకున్నారు.

అయితే పవన్ మాత్రం కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చినా కూడా కాలు బయటపెట్టడం లేదు. దీంతో పవన్‌కు మళ్లీ ఏమైందా అని అందరూ ఆందోళనకు గురవుతున్నారు. కాగా పవన్‌కు కరోనా నెగెటివ్ వచ్చినా, ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు, చాలా బలహీనంగా ఉన్నట్లు తేలడంతో, పవన్‌ను మరో నెలరోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దీంతో ఆయన తన ఫాం హౌజ్‌లో జూన్ నెలవరకు పూర్తి విశ్రాంతి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన పవన్ తిరిగి సినిమా షూటింగ్‌లో ఇప్పట్లో పాల్గొనడని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందో, ఆయన ఎప్పుడు తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు, సాగర్ చంద్ర డైరెక్షన్‌లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.