స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పలు స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందని వివరించారు. క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారని కొనియాడారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, పరిషత్, పంచాయతీ ఉపఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.