జగన్ ను జైలుకు పంపుతాం – పవన్ కళ్యాణ్

వైసీపీ అధినేత , సీఎం జగన్ ను ఖచ్చితంగా జైలుకు పంపుతాం అన్నారు జనసేనధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. వరుస పర్యటనలు చేస్తూ కూటమి శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.

తాజాగా ఈయన ట్విట్టర్ లో.. సీఎం జగన్ను జైలుకు పంపడం ఖాయమని, ఎన్నికలకు ముందా? తర్వాతా? అనేదే ప్రశ్న అని ట్వీట్ చేశారు. తాను విజయవాడ ఎయిరోపోర్టులో వేచి చూస్తుండగా ఓ న్యూస్ పేపర్ లో ‘మోదీ గ్యారంటీ.. అవినీతిపరులంతా జైలుకే’ అనే హెడ్డింగ్ ఆకట్టుకుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటె నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలోని పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించాలని కోరారు. గత కొద్దీ రోజులుగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించడం ఫై తిరుపతి జనసేన శ్రేణులు కాస్త ఆగ్రహంగా ఉన్నప్పటికీ..నిన్న పవన్ భేటీ తర్వాత వారంతా ఆరణి శ్రీనివాసులకు సపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు.