పవన్ కళ్యాణ్ ‘బ్రో’ షూ ఖరీదు తెలిస్తే వామ్మో అనాలసిందే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘BRO’ . తమిళ చిత్రం వినోదయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా నటిస్తున్నారు.

జులై 28న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఈ క్రమంలో సోమవారం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు. ఈ లుక్ లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమదైన స్టైల్తో దర్శనమిచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ బైక్ మీద కాలు వేసి ఎంతో గ్రేస్గా లుక్కిచ్చాడు. అతడి వెనకాలే సుప్రీమ్ హీరో పద్దతిగా నిల్చుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది.

పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ గురించి చర్చ జరుగుతోంది. ఆ షూస్ ఖరీదు లక్ష రూపాయలకు పైగానే ఉంటుంది అంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. కొందరు ఔత్సాహికులు నెట్ లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో తెలిసిన విషయం ఏంటి అంటే ఆ షూస్ బాల్ మెయిన్ యూనికర్న్ కంపెనీ షూస్ గా తెలిసింది. అంతే కాకుండా 82 శాతం నైలాన్ మరియు 14 శాతం ఎలస్టాన్ ఇంకా 4 శాతం థెర్మో ప్లాస్టిక్ పాలీయూరెథాన్ మెటీరియల్ ను షూస్ కోసం ఉపయోగించబడ్డాయట.

బ్లాక్ నేయిర్ కలర్ తో చేయబడ్డ ఈ షూస్ యొక్క ఖరీదు 1207 పౌండ్లు అని ఇంటర్నెట్ లో చూపిస్తోంది. ఇండియన్ కరెన్సీ లో రూ.106870 గా కంపెనీ పేర్కొనడం జరిగింది. ఇండియాలో ఈ షూస్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రత్యేక ఆర్డర్ లపై ఇండియన్స్ ఈ షూస్ ధరించే అవకాశాలు ఉన్నాయి. ఇక BRO లో ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కామెడీ-డ్రామాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.