అమ‌రావ‌తిలో నేడు జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశం..హాజరుకానున్న పవన్

అమ‌రావ‌తిలో నేడు జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశం..హాజరుకానున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. రీసెంట్ గా జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు విజయడంకా మోగించడం తో పవన్ లో ఉత్సహం పెరిగింది. దీంతో సోషల్ మీడియా లో వరుస ట్వీట్స్ తో తన దూకుడు చూపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈరోజు అమ‌రావ‌తిలో జ‌న‌సేన విస్తృత‌స్థాయి స‌మావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజ‌రుకానున్నారు. ప్ర‌భుత్వ విధానాలు, రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు, శ్ర‌మ‌దానం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

అలాగే బ‌ద్వేలు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశం పై కూడా మాట్లాడనున్నారు. అదేవిధంగా అక్టోబ‌ర్ 2న తూర్పు గోదావ‌రి, అనంత జిల్లాల్లో ప‌వ‌న్ పర్యటించనున్నారు. ఇక పవన్ టూర్ తో మరోసారి రాజకీయాల్లో ఆక్తి పెరిగినట్లు అయ్యింది. గత మూడు రోజులుగా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాటల యుద్ధం చేయడం..ఇప్పుడు పవన్ ఆంధ్ర లో పర్యటించబోతుండడం తో రాజకీయాల్లో చర్చ గా మారింది.