డిసెంబరు 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం

డిసెంబరు 7 నుంచి 29 వరకు కొనసాగనున్నసమావేశాలు..

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీః పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 7న సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 7 నుంచి 29 వరకు సమావేశాల నిర్వహణకు నిర్ణయించినట్లు తెలిపారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి. 23 రోజులపాటు కొనసాగే సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

కాగా, పార్లమెంట్ సమావేశాల కంటే ముందే నవంబర్ 21వ తేదీన ప్రి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈనెల 21 ప్రి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థికసంవత్సర బడ్జెట్‌ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమల చాంబర్లు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగం నిపుణులతో వర్చువల్‌గా భేటీ అవుతారు. 22న వ్యవసాయం, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్ల ప్రతినిధులతో సమావేశమవుతారు. 24న ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం సహా పలు రంగాలకు చెందిన నిపుణులతో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించే 2023-24 బడ్జెట్‌ రూపకల్పనకు నిపుణులు సూచనలు ఇవ్వనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/