రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సంచలనం..రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటకు

రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సంచలనం బయటపడింది. ఆత్మహత్య కు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో లో తమ ఆత్మ హత్య కు కారణం రాఘవే అని తెలిపారు. తన సమస్య తీరాలంటే..తన భార్య ను అడిగాడని ..అలాచేస్తేనే నీ సమస్య తీరుతుంది..లేదంటే తీరదు. నువ్వు ఎవడి దగ్గరికి వెళ్లిన పని జరగదని రాఘవ అన్నట్లు రామకృష్ణ తన సెల్ఫీ వీడియో లో తెలిపాడు. అతడి తో పోరాటం చేయలేక మీము ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపాడు. తాను మాత్రమే ఆత్మహత్య చేసుకునే..నా భార్య , పిల్లలను వదలడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీడియో లో తెలిపాడు.

కొత్తగూడెంలోని తూర్పుబజార్‌లో నివాసముంటున్న రామకృష్ణ… పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగేంచేవాడు. ఇటీవల ఇతరులకు లీజుకు ఇచ్చి, రాజమహేంద్రవరానికి వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగి వచ్చారు. అనంతరం పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దహనం కాగా.. చిన్న కుమార్తె తీవ్రగాయాలతో బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధువారం ఉదయం కన్నుమూసింది. కాగా రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కు కారణం ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్‌ అని రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని , అతడి ఫై కేసు నమోదు చేసారు. వనమా రాఘవేందర్​కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని… వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే… ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటకు రావడం అందులోని వనమా రాఘవేందర్ పేరే చెప్పడం జరిగింది. మరోపక్క మృతుడి బావమరిది జనార్థన్‌రావును కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అనుచరులు బెదిరిస్తున్నారు. దీనిపై జనార్థన్ రావు ఏసీపీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు.