మిహీకా బజాజ్‌తో స్టార్‌హీరో రానా దగ్గుబాటి నిశ్చితార్ధం!

అభిమానులను ఆశ్చర్యపర్చిన ‘భళ్లాలదేవుడు’

Rana Daggubati with Miheeka Bajaj


స్టార్‌ హీరో, నిర్మాత రానా దగ్గుబాటి, తనకు మిహీకా బజాజ్‌తో నిశ్చితార్ధం అంటూ సోషల్‌ మీడియాలో వెల్లడించారు.. మిహీకా బజాజ్‌తో తన నిశ్చితార్ధాన్ని ప్రకటించటంతో నటుడు రానా దగ్గుబాటి మంగళవారం తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.

అంతేకాదు మిహీకా బజాజ్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. అంతేకాదు..’అండ్‌ షి సెడ్‌ ఎస్‌..మిహీకా బజాజ్‌ …అని క్యాప్షన్‌ పెట్టారు..

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోపుట్టిపెరిగిన మిహీకాకు డ్యూ డ్రాప్‌ డిజైన్‌ స్టూడియో అనే డిజైన్‌ సంస్థ ఉంది..అయితే మూడుముళ్లు ఎపుడు వేస్తారనేది వెల్లడి కాలేదు..

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే జరుగుతుందని అంటున్నారు.

ఈ జంటకు రానా సహచరులు, పరిశ్రమకు చెందిన స్నేహితులు, అభిమానులు నుంచి అభినందన సందేశాలు , శుభాకాంక్షలు కురిపిస్తున్నారు..ప

్రస్తుతం రానా ‘విరాటపర్వం, ‘హాతిమేరే సాతి చిత్రాల్లో నటిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/