ఇమ్రాన్ ఖాన్ కు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలి: పాక్ ప్రధాని ఆదేశం

ఇమ్రాన్ కు దుండగుల నుంచి బెదిరింపులు
పూర్తి స్థాయిలో భద్రతను కల్పించాలన్న ప్రధాని షెహబాజ్


ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు దుండగుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తమ నేత ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇమ్రాన్ కు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణమే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలని పేర్కొన్నారు.

ఈరోజు రాత్రి లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ఒక ర్యాలీని నిర్వహించనున్నారు. ర్యాలీకి సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో, వర్చువల్ గా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాలని ఆయన మద్దతుదారులు కోరారు. వారి సూచనను ఇమ్రాన్ తిరస్కరించారు. ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆయన భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/