జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఈ ఘటన పట్ల హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం అత్యంత బాధాకరమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఒవైసీ .. నిందితులు క్ష‌మించ‌రాని నేరం చేశార‌ని, వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజులు అవుతున్నా.. అసదుద్దీన్ ఒవైసీ స్పందించలేదు. దేశంలో ఎక్కడా ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించే ఒవైసీ .. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఒవైసీ దీనిపై స్పదించకతప్పలేదు.

ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన వారంతా రాజకీయ నేతల పిల్లలే. వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు, ఎంఐఎం నేత తనయుడు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కుమారుడు అరెస్ట్ అయ్యారు. కాగా, తొలుత ఎమ్మెల్యే కొడుకు ఈ ఘ‌ట‌న‌లో లేడ‌ని చెప్పిన పోలీసులు మ‌రికొన్ని ఆధారాలు ల‌భించ‌డంతో కేసు పెట్టేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు . బెంజీ కారులో ఉన్న వీడియోలో ఎమ్మెల్యే కొడుకు ఉండటంతో లీగల్ ఒపినీయన్ తీసుకుంటున్నారు. అతనిని కేసులో ఆరో నిందితుడిగా చేర్చబోతున్నారని తెలుస్తోంది.