దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములే

నేడు ప్రవాస భారతీయ దివస్‌

NRIs are partners in national development
NRIs are partners in national development

విశ్వవ్యాప్తంగా గొప్పవారి ‘జయంతులు ‘వర్ధంతులు’ జరపడం ఆనవాయితీ. ఎందుకంటే వారుచేసిన కృషిని, త్యాగాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆచరించవలె ననే ఒక మంచి సంకల్పమే దానికి కారణం.

అలాగే ఒక మంచి సందర్భాన్ని కూడా ఒక ప్రత్యేక దినంగా జరపడం వల్ల కూడా ఆ సంఘటనకు ప్రాధాన్యత కల్పిస్తూ దానికి సంబంధించిన కార్యమ్రాన్ని నిర్వహించడం కూడా ఆనవా యితీగా మారింది. ఈ రోజుకు కూడా అలాంటి ప్రత్యేకత ఉంది.

1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన ‘మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్‌గా జరుపుకుంటున్నాం.

ఇది 2003వ సంవత్సరం నుండి భారత ప్రభుత్వంచే ఘనంగా నిర్వహించబడుతుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయు లను ‘ప్రవాస భారతీయులు అని అంటారు. ఇంగ్లీషులో నాన్‌-రెసిడెంట్‌ ఇండియన్స్‌ (ఎన్‌ఆర్‌ఐ) అనీ లేదా పర్సన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (పిఐఒ) అని కూడా పిలుస్తారు. వారు రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా వెలుపల నివసించే భారతీయ సంతతికి చెందిన లేదా భారతీయ మూలాలున్నవారని అర్థం.

విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకా రం3.3కోట్ల ప్రవాస భారతీయులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవలస జనాభా లో 5.5కోట్లమంది లో భారతీయ మూలాలున్నవారే అత్యధికులు. దక్షిణాఫ్రికా దేశజనాభాలో మనవారు 2.4 శాతం, కెన్యా జనాభాలో 1.13 శాతం, సౌదీఅరేబియాలో 23.22 శాతం, నేపాల్‌లో 14.7శాతం,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 42.1శాతం, మలేసియాలో 7.4శాతం, శ్రీలం కలో 5.4 శాతం, ఇంగ్లాండ్‌లో 1.8శాతం, సింగపూర్‌లో 8.3శాతం, బెహరన్‌లో 21శాతం, ఇటలీలో 0.12శాతం, కెనడాలో 4.02శాతం ఇలా ప్రపంచం లో 150కిపైగా దేశాల్లో మనవారున్నారు.

1980వ సంవత్స రం తర్వాత నుండి సాఫ్ట్‌వేర్‌రంగం అనూహ్యంగా పైకెగసింది. అమెరికా లో జరిగిన ఆర్థికాభివృద్ధి చాలామంది భారతీయులను ఆకర్షించింది.

అలాగే అరబ్‌దేశాల్లో పెట్రోలు బయల్పడటం, మరిన్నిదేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించడంవల్లఅనేక మంది భారతీయులు ఆయా దేశాలకు వలసవెళ్లారు. వివిధ కారణా లవల్ల ఇలా వలస వెళ్లినవారు, ఆయాదేశాల్లో స్థిరపడిన భారతసంతతి వారు అందరూకలిసి దాదాపు 33మిలియన్ల వరకూ వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.

ప్రస్తుతం వారిలో చాలామంది భారతీయులను ఈ దేశ అభివృద్ధిలో భాగస్వా ములుగా చేసి మన దేశాభివృద్ధికి వారిని ఉపయోగించుకో వాల్సిన అవసరం ఉంది.ప్రపంచంలోనే అత్యధిక ప్రవాసీలు భారత్‌కు చెందిన వారే.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ప్రవాసీలు ప్రత్యే కంగా తెలుగు సంఘాలుగా ఏర్పడి మన ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.

  • రఘుపతిరావు గడప

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/