హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు

క‌రీంన‌గ‌ర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో, ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నామినేష‌న్ల గ‌డువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజున తమ నామినేషన్లు దాఖలు చేశారు. గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్), ఈటల రాజేందర్ (బీజేపీ), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 11న పరిశీలించనున్నారు. ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 30న పోలింగ్, నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/