కొల్లాం జిల్లాలో ఎనిమిదోరోజు రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra resumes from Kollam district in Kerala

కేరళః కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఈరోజు ఉదయం 7 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. కేరళలోని కొల్లాం జిల్లాలో ఎనిమిదోరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. కేరళలో మొత్తం 19 రోజులు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర పూర్తయ్యాక రాహుల్ గాంధీ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరో యాత్ర సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/