పాకిస్తాన్‌లో కూలిన గని.. 9 మంది మృతి

Marble mine collapsed in Pakistan
Marble mine collapsed in Pakistan

పెషావర్‌: పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ఫక్తూన్వా ప్రావిన్స్‌లోని బునార్‌ జిల్లా బంపోఖా ప్రాంతంలో వున్న ఒక మార్బుల్‌ గని కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారని అధికారులు చెప్పారు. వాయవ్య పాకిస్తాన్‌లో సంభవించిన భూప్రకంపనలతో ఈ గని కుప్పకూలిందని, ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారని ప్రావిన్షియల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. ఈ గని శిధిలాల కింద ఇప్పటికీ 15 మంది చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు సైన్యం సాయంతో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/