కాకా రేపుతున్న నిహారిక హాట్ లుక్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హాట్ పోజ్ తో కాకరేపుతుంది. డాన్స్ రియాలిటీ షోతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తరువాత నాన్నకూచి అనే వెబ్ సిరీస్ చేసింది. తర్వాత ఒక మనసు , నెక్స్ట్ హ్యాపీ వెడ్డింగ్ , సూర్యకాంతం అనే సినిమాలు చేసినప్పటికీ ఏవేవి కూడా విజయం సాధించలేకపోయాయి. దీంతో బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ పాత్రలకి విరామం ఇచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేసింది. డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

కొద్దీ రోజులుగా డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్ లలో బిజీ గా ఉన్న నిహారిక..ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావడంతో ఇప్పుడు తన డెడ్ ఫిక్సల్స్ లేడీ బ్యాచ్ తో హ్యాపీగా ఇండోనేసియాలో బాలి వెకేషన్ కి చెక్కేసింది. అక్కడ ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబందించిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో నిహారిక షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో ఎల్లో కలర్ ఫ్రాక్ తో నిహారిక నిండుగా అందాలని ఆరబోస్తూ గ్లామర్ షోతో రెచ్చిపోయింది.