తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ..

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు పార్టీ లు ఉండగా…ఈ మధ్యనే వైస్ షర్మిల YSR తెలంగాణ పార్టీ (YSRTP) ను ఏర్పటు చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉంది. ఇదిలా ఉండగానే రాష్ట్రంలో మరో పార్టీ పుట్టుకొస్తుంది. డాక్టర్ వినయ్ నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు.

హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్ లో తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణ లో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్ తో కొత్తపార్టీ పెడుతున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్ లో కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వినయ్ కొత్త పార్టీ వైపు అడుగులు వేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ లో ఉన్న పార్టీ లతో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే. మరి ఇన్ని పార్టీ లు ఉండగా..ఇప్పుడు డాక్టర్ పార్టీ ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుందో చూడాలి.