షర్మిల తో కలిసి పాదయాత్ర చేసిన ప్రముఖ లేడి యాంకర్

షర్మిల తో కలిసి పాదయాత్ర చేసిన ప్రముఖ లేడి యాంకర్

వైఎస్సార్‌ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ లో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు షర్మిల పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. రీసెంట్ గా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..షర్మిల పాదయాత్ర కు మద్దతు ప్రకటించి షర్మిల లో ఉత్సాహం నింపగా..తాజాగా ప్రముఖ లేడి యాంకర్ శ్యామల సైతం షర్మిల పాదయాత్ర లో పాల్గొంది.

ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని అన్నారు. గత ఎనిమిది రోజులుగా అక్క నడుస్తున్నారని… ప్రతి ఒక్కరు వారి సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారని… ఆ విషయాన్ని తాను స్వయంగా చూశానని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కూతురు, మరో సీఎం చెల్లెలు అయిన అక్క ఎంతో సంతోషంగా ఉండొచ్చని… కానీ వారి నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు సాగుతుండటం చాలా గొప్ప విషయమని అన్నారు.