సమంత న్యూ వేడుకలను ఎవరితో జరుపుకోబోతుందో తెలుసా..?

ఎక్కడ చూసిన ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకల్లో నిమగ్నమయ్యారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏడాది విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. కానీ ఈసారి కరోనా , ఓమిక్రాన్ వైరస్ ల కారణంగా చాలామంది తమ ఇళ్లల్లోనే వేడుకలు జరుపుకుంటున్నారు. కొంతమంది మాత్రం మాల్దీవుల్లో , గోవాలో జరుపుకుంటున్నారు. ఇక క్రేజీ బ్యూటీ సమంత సైతం గోవా లో న్యూ వేడుకల్లో బిజీ గా ఉంది.

సమంతా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ న్యూఇయర్‌ రోజు తన సన్నిహితులతో గడపాలని ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఆమె మాట్లాడుతూ “ఏడాది పొడవునా నన్ను హ్యాపీగా ఉంచిన గొప్ప స్నేహితులు నాకు ఉన్నారు. కాబట్టి నేను వారితో, నా కుక్కలతో, ముఖ్యంగా నా తల్లితో సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను. ఈ సంతోషకరమైన సమయంలో వారితో గడపడం అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్యతో విడాకుల తర్వాత సామ్ జోరు పెరిగింది. టాలీవుడ్ తో పాటు..బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం యశోద అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తుండగా..మలయాళం..కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సమంత కెరీర్ లో తొలి సౌత్ పాన్ ఇండియా చిత్రంగా నిలవబోతుంది. అలాగే హిందీలోనూ తాప్సీ నిర్మాణ సంస్థలో మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం కమిట్ అయింది.