శ్రీవారిని దర్శించుకున్న విగ్నేష్ – నయనతార

డైరెక్టర్ విగ్నేష్ – నయనతార లు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ రొమాంటిక్ డ్రామా ‘కాతు వాకుల రెండు కాదల్’ ఈరోజు తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్, నయనతార లు తెల్లవారు జామున తిరుమల ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార , సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో విడుదలైంది. విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. విగ్నేష్ శివన్, నయనతార లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోకపోయినప్పటికీ పబ్లిక్ గా ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం కాస్త టైం పడుతుందని చెపుతూ వస్తున్నారు.