చేనేతకు చేయూత నివ్వాలి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా

Handloom Working

చేనేత సహకార సంఘాల పెద్దలు ఒకనిర్ణయానికి వచ్చి క్రితం సంవత్సరం జులై 12,13,14 తేదీలలో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని నాగార్జున నగర్‌ కమ్యూనిటీహాల్‌లో చేనేత వస్త్రాల సంత ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి అన్ని రకాల చేనేత వస్త్రాలను, ముఖ్యంగా చీరలను తెప్పించి మగ్గాల రేటుకే అమ్మకానికి ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రయత్నం కొంతవరకు ఫలించింది. ఆ విధంగానే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఓ మూడు నాలుగు చోట్ల ఏర్పాటు చేయాలనుకున్నారు. కాని కరోనా వల్ల చేయలేకపోయారు.

కెమికల్‌ రంగులు వాడినవి, యంత్రాలపై నేసినవి వాడకూడదని, శరీరం అనారోగ్యం పాలవ్ఞతుందని ప్రజల్లో మార్పు కలిగించాలి.

అంతేకాకుండా మగ్గాలపై నేసిన వస్త్రాలను వాడితే చేనేత కార్మికులను బతికించిన వారమవ్ఞతామని వినియోగదారులలో చైతన్యం కలిగించాలి. ఈ విధంగా చేనేతకు చేయూత నివ్వాలి.

భారతదేశ జనాభాలో 2011 గణాంకాల ప్రకారం బల హీనవర్గాల కులాల వాళ్లు 52 శాతం ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్ర దేశ్‌లో 53 శాతం, తెలంగాణాలో 59 శాతం ఉన్నారు.

అంటే దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనంత మంది బిసిలు తెలంగాణాలో ఉన్నారన్నమాట. తెలుగురాష్ట్రాలలో సరాసరి 56 శాతం ఉన్న బిసిలలో 112 కులాల వాళ్లు ఉన్నట్లు గుర్తించబడ్డారు.

దీంట్లో ఓ 46 కులాలు ప్రత్యేకించి చేతివృత్తుల వాళ్లు. వీళ్లలో సుమారు 12 కులాల చేతివృత్తులు మటుమాయం అయ్యాయి అని చెప్పవచ్చు.

ఆ కులాల వాళ్లు కూడా కనుమరుగైపోయారు.

ఇక మిగిలిన చేతి వృత్తుల కులాలో పద్మశాలీలు, కమ్మరులు, కుమ్మరులు, ముది రాజులు, గంగపుత్రులు (జాలరులు), దర్జివాళ్లు( మేరి) కంచరులు, కంసాలీలు, యాదవ్ఞలు, కురుమలు, నాయీబ్రాహ్మణులు, రజకులు, వంజర, వంశరాజులు మొదలగు కులాలలో పద్మశాలీలే అధికం. వీళ్లనే వృత్తిరీత్యా చేనేత కార్మికులు అని కూడా అంటారు.

తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే సిరిసిల్లా, గద్వాల, పోచంపల్లి, కొత్తకోట, వెంకటగిరి, నారాయణపేట, భువనగిరి మొదలగు ప్రాంతాలలో పేరెన్నికగన్న చేనేత కళాకారులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పాటూరు, ఉప్పాడ, గుంటూరు, చీరాల, పొందూరు మొదలగు ప్రాంతాలలో రకరకాల పట్టుచీరలు, కాటన్‌ చీరలు నేసేవారు.

పొందూరు ఖద్దరు పంచెలకు, దోవతులకు, కండువల (తువ్వాలు)కు ప్రసిద్ధి పొందింది. ఈ ప్రదేశాలలోనే కాకుండా సిద్ధిపేట, కరీంనగర్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా దాదాపుగా ప్రతి గ్రామంలో మగ్గాలు కనిపిస్తాయి.

చేనేత వస్త్రాల వాడకం రోజురోజుకు ఎందుకు తగ్గిపోతుంది? దీనికి ముఖ్యమైన రెండు కారణాలు న్నాయి.

కాలానుగుణంగా ప్రజలలో చాలా మార్పువచ్చింది. యాభై ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలో నూటికి 80 శాతం మంది చేనేతకార్మికులు నేసిన దోవతులు, పంచెలు ధరించేవాళ్లు.

సగంపైకి మడతపెట్టేవాళ్లు. అంటే మోకాళ్ల నుండి కింది కాళ్లు కనపడేవి. పైన భుజం మీద తుండుగుడ్డ (తువ్వాలు) కప్పుకునేవారు.

ఈ నేత వస్త్రాల వల్ల ఎండాకాలం చలువగాను, చలికాలం వెచ్చగాను ఉండేది. మరి ఇప్పుడు పల్లెటూళ్లలో సైతం ప్యాంట్లు, నైట్‌ ప్యాంట్లు, జీన్స్‌ ప్యాంట్లు ధరిస్తున్నారు.

ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే పంట చేన్లలో పనిచేసేవారి దగ్గరి నుండి ఇళ్లల్లో ఇప్పుడు నలభై ఏళ్లలోపు ఆడవాళ్లంతా డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఈ విధంగా చేనేత వస్త్రాల వాడకం బాగా తగ్గిపోయింది. ఆదరణ తగ్గింది.

రెండవ కారణం మనుషుల స్థితిగతులు, పెళ్లి నిశ్చయమై నప్పుడు పెళ్లికూతురు తల్లిదండ్రులు, పెళ్లిచీర నేయమని ఆర్డర్‌ ఇచ్చేవారు.

పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కాబోయే కోడలుకు కనీసం రెండు పట్టు చీరలు ఆర్డర్‌ ఇచ్చేవారు. పెళ్లినాటికి ఈ చీరలు నేసి ఇచ్చేవారు చేనేత కార్మికులు. దీనివల్ల వాళ్లకు కొంత జీవనోపాధి లభించేది.

మరి ఇప్పుడు సమీపంలోని నగరాలలో పెద్దపెద్ద షోరూంలకు వెళ్తున్నారు. కండ్లు మిరుమిట్లు గొలిపే లైట్ల వెలు తురులలో వందలాది చీరలు పరుస్తారు.

నిమిషాలలో కొనుగోలు చేస్తున్నారు. వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి కొంటున్నారు. దీంతో చేనేత కార్మికులకు పనిలేకుండాపోతుంది. ఇక కాటన్‌ చీరల వాడకం కూడా బాగా తగ్గిపోయింది.

వీటిస్థానంలో రకరకాల సిల్కుచీరలు, లైలాన్‌ చీరలు వస్తున్నాయి. నెలనెలా మారుతున్న ఫ్యాషన్‌ చీరలు రావడంతో వాటికి ఎగబడుతున్నారు మహిళలు.

దీంతో పట్టుచీరలే కాకుండా, కాటన్‌చీరల డిమాండు తగ్గిపోయిం ది. తెలంగాణరాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఉన్న చేనేత కార్మికులు చాలా దీనావస్థలోనే ఉన్నారు. ఒక్క సిరిసిల్ల వారు మాత్రమే కాస్త బాగున్నారు.

కారణం ముఖ్యమంత్రి కుమారుడు కెటిఆర్‌ నియోజకవర్గం అయినందున. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీలో భాగంగా లక్షలాది చీరలు నేసేపని సిరిసిల్ల చేనేత కార్మికులకు అప్పచెప్తున్నారు. దీంతో దాదాపుగా సంవత్స రం పొడవ్ఞనా వారికి పని దొరకడమే కాకుండా జీవనోపాధి దొరికింది.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ మిగతా ప్రాంతాల వారి సంగతి ఏమిటి? రాష్ట్రంలో అక్కడక్కడ జీవిస్తున్న పద్మ శాలీల జీవనం అగమ్యగోచరంగా తయారైంది.

మామూలు పట్టు చీర తయారు చేయడానికి సుమారు వెయ్యి రూపాయల ముడి సరుకులు, పట్టు,రంగులు, దారాలు కాటను మొదలగునవి కొని, కనీసం పది రోజులు ఏకధాటిగా నేస్తే చీర తయారవ్ఞతుంది.

అప్పుడు దాన్ని కనీసం ఎనిమిదివేలకు అమ్మాలి. అంటే నేర్పు, నైపుణ్యం కలిగిన వ్యక్తికి రోజుకు ఐదువందలు గిట్టుబాటు అవ్ఞ తుంది. అది కూడా వారంలో అమ్ముడుపోకపోతే వెయ్యి రూపా యలు తగ్గించి అమ్మజూపుతారు.

ఆకలి చావ్ఞలకు చస్తామో ఏమో అని ఇంకో వెయ్యి తగ్గించి అమ్మడానికి పెడతారు. ఇలా దారుణ మైన బతుకులు బతుకుతున్నారు చేనేత కార్మికులు.

ఇలా ఆకలి చావ్ఞలు సర్వసాధారణమైపోయాయి వీళ్లలో. అందుకే ప్రభుత్వాలు చేనేత పనివారిపై జాలి, దయ, చూపాలి. వారిని ఆదుకోవాలి.

ప్రతి మగ్గానికి సబ్సిడీ ప్రకటించాలి. చేనేత సహకార సంఘాల పెద్దలు ఒకనిర్ణయానికి వచ్చి క్రితం సంవత్సరం జులై 12,13,14 తేదీలలో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని నాగార్జున నగర్‌ కమ్యూ నిటీహాల్‌లో చేనేత వస్త్రాల సంత ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి అన్ని రకాల చేనేత వస్త్రా లను, ముఖ్యంగా చీరలను తెప్పించి మగ్గాల రేటుకే అమ్మకానికి ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రయత్నం కొంతవరకు ఫలించింది. ఆ విధంగానే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఓ మూడు నాలుగు చోట్ల ఏర్పాటు చేయాలనుకున్నారు.

కాని కరోనా వల్ల చేయలేకపో యారు. కెమికల్‌ రంగులు వాడినవి, యంత్రాలపై నేసినవి వాడ కూడదని, శరీరం అనారోగ్యం పాలవ్ఞతుందని ప్రజల్లో మార్పు కలిగించాలి.

అంతేకాకుండా మగ్గాలపై నేసినవస్త్రాలను వాడితేచేనేత కార్మికులను బతికించిన వారమవ్ఞతామని వినియోగదారులలో చైతన్యం కలిగించాలి.ఈ విధంగా చేనేతకు చేయూత నివ్వాలి.

మునిగంటి శతృఘ్నాచారి, (రచయిత: కార్యదర్శి, రాష్ట్ర బిసి సంఘం, తెలంగాణ)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/