నాని ‘దసరా’ మాస్ లుక్ విడుదల

నేచురల్ స్టార్ నాని దసరా లుక్ వచ్చేసింది. రీసెంట్ గా అంటే సుందరానికి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని..త్వరలో దసరా మూవీ తో రాబోతున్నాడు. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ను వేశారు. మేజర్ పార్టు షూటింగు ఈ సెట్లో జరగనుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సెట్ లో ఉన్న ఫొటోను షేర్ చేసింది సినిమా యూనిట్. మాస్ లుక్ తో ఉన్న నాని ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరి కాంబినేషన్ సీన్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు.

ఇక ఈ పిక్ లో నాని లుంగీ మరియు బనియన్ లలో అవుట్ అండ్ అవుట్ రూరల్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. బొగ్గు గనిపై నిలబడి బీడీ తాగడాన్ని ఇందులో గమనించవచ్చు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. నాని కెరీర్‌లో ఇది వరకు చేయని ఓ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇదే. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తుండగా , సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.