నటుడు నాగశౌర్య విల్లాపై పోలీసుల దాడులు..పేకాట ఆడుతున్న పలువురు అరెస్ట్

హీరో నాగశౌర్య విల్లాపై గత రాత్రి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసారు. ఈ దాడి లో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ విల్లా ఒక ఐఏఎస్ అధికారికి చెందినదని, అయితే నాగశౌర్య ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లీజుకు తీసుకున్న విల్లాలో నాగశౌర్య వీకెండ్‌లలో తెలంగాణ, ఎపిలోని ప్రముఖులు పేకాట ఆడుకునేందుకు ఇస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కాగా సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం నిర్వాహకుడు విల్లా అద్దెకు తీసుకున్నాడని, విల్లాలో తరచూ పేకాట క్లబ్ ను సుమంత్ చౌదరి నిర్వహిస్తున్నట్లు పోలీసులు విచారణ వెల్లడైంది. ఈక్రమంలో సుమంత్ చౌదని వెనుక ఎవరెవరున్నారన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.