ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందిస్తూ..‘ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/