భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలుః ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీః గృహ హింస చట్టం మన దేశంలో పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గృహిణులకు భద్రతను కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, చాలా మంది ఈ చట్టాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. భర్తలను హింసించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. భర్తలు, వారి మొత్తం కుటుంబసభ్యులపై భార్యలు పెడుతున్న తప్పుడు కేసులతో ఈ చట్టం దుర్వినియోగమవుతోందని… ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పింది. దీన్ని ఇలాగే వదిలేస్తే… చట్టం మరింత దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

ఒక కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన భర్త కుటుంబం నుంచి డబ్బులు లాగేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య ప్లాన్ వేసింది. తాను కనిపించకుండా పోయింది. తన కూతురు భర్త, ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి డబ్బులు లాగేందుకు యత్నించారు. ఈ క్రమంలో తాము తప్పు చేయలేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబసభ్యులు నాటకమాడినట్టు కోర్టు గుర్తించింది. ఈ నేరానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల భర్త, ఆయన కుటుంబ సభ్యులు సమాజంలో పరువు కోల్పోతారని, తీవ్ర వేదనను అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పుడు పనులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/