నన్ను కావాలనే బ్యాడ్ చేశారు: ముమైత్ ఖాన్‌

బిగ్‏బాస్ షో నుంచి ఎలిమినేట్‌

Mumaith khan-Eliminate from the Bigg Boss Show
Mumaith khan-Eliminate from the Bigg Boss Show

‘బిగ్‏బాస్’ రియాల్టీ షో లో ఈ ఆదివారం ఎలిమినేష‌న్ జ‌రిగింది. మొదటివారం ఎలిమినేషన్ లో మిత్రశర్మ, ఆర్జే చైతు, నటరాజ్‌ మాస్టర్‌, అరియానా, సరయు, హమీదా, ముమైత్‌ ఖాన్ ఉన్నారు. మిత్రశర్మ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతుందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా ముమైత్‌ఖాన్ హౌస్‌ నుంచి బయటకు వచ్చింది. ముమైత్‌ కు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున వెల్లడించారు. ఎలిమినేషన్‌ సమయంలో నవ్వుతూ సరదాగా కనిపించిన ముమైత్‌ స్టేజీ మీదకు రాగానే కన్నీటిపర్యంతమైంది. ‘మొదటి బిగ్‌ బాస్‌ సీజన్‌లో పడిన మార్క్‌ను తొలగించుకునేందుకు ఇక్కడ అడుగుపెట్టాను. ఇప్పుడు ఇంత త్వరగా బయటకు వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. చాలా బాధగా ఉంది. నన్ను కావాలనే బ్యాడ్ చేశారు.. ’ అంటూ ముమైత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాణిజ్య (బిజినెస్) వార్తల కోసం : https://www.vaartha.com/news/business/