జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ

mudragada-padmanabham-has-written-to-pawan-kalyan

అమరావతిః జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌కు ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం సంధించారు. బిజెపి, టిడిపి, మీరు కలిసి పోటీ చేస్తామని తరుచూ అంటున్నారు. అటువంటప్పుడు నా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి. నన్ను ముఖ్యమంత్రిని చేయండని ఎలా అడుగుతున్నారో తనకు అర్థం కాని ప్రశ్న అంటూ విమర్శించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండి. అనే పదం వాడాలి తప్పా.. కలిసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ సూచించారు ముద్రగడ పద్మనాభం.

పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడాలి అని అన్నారు. వీధిరౌడీలా మాట్లాడటం ఎంతవరకు సమంజనం అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను తిట్టడానికి వృధాచేయొద్దు అంటూ హితవు పలికారు. మీ ప్రంగాల్లో పదేపదే తొక్కతీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటున్నారు. గుండు గీయిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని ఇలా చేశారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.

తాను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదన్నారు. తాను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తాను ఉద్యమాలు చేయలేదని. చంద్రబాబు ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్‌ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి చంద్రబాబు ద్వారా పవన్‌ కల్పించారని లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే వైసీపీలో చేరి కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.