వెంకయ్యనాయుడితో విజయసాయిరెడ్డి భేటి

స్టాండింగ్ కమిటీ రిపోర్టును అందించిన విజయసాయి

vijayasai-reddy-meets-venkaiah-naidu

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఉపరాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆయన… వాణిజ్యానికి సంబంధించిన స్థాయి సంఘం ఆమోదించిన 154వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టును వెంకయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులు, పంటలు, పసుపు, కొబ్బరి పీచు వంటి వాటికి సంబంధించిన రిపోర్టును గౌరవనీయులైన ఉపరాష్ట్రపతికి అందించడం జరిగిందని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ స్థాయి సంఘం వాణిజ్యం కమిటీ చైర్మన్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/