వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన అనిల్ కుమార్ యాదవ్

anil-kumar-yadav

వెంకటేశ్వరపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని ఎమ్మెల్యే అనిల్‌ పేర్కొన్నారు.

నేను చేసినంత ధైర్యంగా లోకేష్‌ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. లోకేష్‌ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. నేను ఎదుటి వారికి సహాయం చేశాను కానీ అక్రమాస్తులు కూడబెట్టలేదన్నారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుందన్నారు. నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు అని అనిల్ అన్నారు. నాకు వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నాయని పత్రాలు విడుదల చేశారని… లేని ఆస్తులను నాకు అంటగట్టారని ఆగ్రహించారు.

ఇస్కాన్ సిటీలో నాకు 8 ఎకరాల భూమి ఉండేది ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉందని.. నాకు ఏ రాష్ట్రంలో వ్యాపారాలు లేవు, ఇతర జిల్లాల్లో కూడా లేవన్నారు. నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం లభించిందని.. నాకు వెయ్యి కోట్లు ఉందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రచారం చూసి ఐటి శాఖ అధికారులు కూడా విచారణ చేస్తారేమో….వాళ్లు విచారణ చేసే క్లీన్ చిట్ ఇస్తే సంతోషమే అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరిని శిక్షిస్తారో వచ్చే ఎన్నికల్లో చూద్దామని సవాల్‌ చేశారు.