పబ్ యాజమాన్యాలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రభుత్వాన్ని విమర్శల పాలుచేస్తుంది. రీసెంట్ గా బంజారాహిల్స్ పబ్ లో డ్రగ్స్ బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ప్రతిపక్షాలు సైతం పబ్ కల్చర్ ఫై , డ్రగ్స్ వ్యవహారం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పబ్ యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్ యాజమాన్యాలతో బేగంపేటలోని హరిత ప్లాజాలో ఈరోజు శనివారం శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పిన మంత్రి.. పబ్బుల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యతని స్పష్టం చేశారు. డ్రగ్స్‌‌ దొరికిన పబ్బులను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భాంగా హెచ్చరించారు.

శుక్ర, శని వారాల్లో రాత్రి 1 గంటవరకు పబ్‌లకు అనుమతి ఉందని.. మిగతా రోజుల్లో 12 గంటలకే క్లోజ్ చేయాలని సూచించారు. నిర్దేశించిన సమయం తర్వాత కూడా పబ్ తెరిచి ఉంచితే యజమానులపై చర్యలు తీసుకుంటామని, ఆ పరిధిలోని పోలీస్, ఎక్సైజ్ అధికారులపైనా వేటు పడుతుందని హెచ్చరించారు. సౌండ్స్ విషయంలోనూ పరిమితి పాటించాలని సూచించారు. గత శనివారం ఒక పబ్ లో అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకున్నామని..ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేసారు. ఎక్కడైనా ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీనివాస గౌడ్ హెచ్చరించారు.