సెల్ఫీపై మంత్రి కెటిఆర్ సరదా వ్యాఖ్య

సెల్ఫీకి రూ. 500 ఇవ్వండి.. మంత్రి కెటిఆర్‌

Minister KTR’s humorous comment on selfie goes viral

సిరిసిల్లాః మంత్రి కెటిఆర్‌కు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పర్యటనలు చేపట్టిన ప్రతిసారీ యువతీయువకులు సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. ఇక కెటిఆర్ కూడా అడిగిన వారికి కాదనకుండా అభిమానులు, కార్యకర్తలతో ఫొటోలు దిగుతుంటారు.

తాజాగా కెటిఆర్..రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే.. అడిగిన వారిని కాదనకుండా మంత్రి ఫొటోలకు పోజులిచ్చారు. కానీ.. అభిమానుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో సెల్ఫీలకు రూ.500 ఖర్చవుతుందంటూ సరదాగా కామెంట్ చేశారు. అయితే.. కెటిఆర్‌ను చూసిన సంతోషంలో ఉన్న అభిమానులు మంత్రి కామెంట్స్‌ను పక్కన పెట్టేసి తమదారిన తాము సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.