మణిపూర్ ఘటనపై ప్రధానిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

మణిపూర్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్‌) ఆరోపించింది.

ఈ ఘటన ఫై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..ప్రధాని మోడీ , అమిత్ షా లను ప్రశ్నించారు. ఇది చాలా బాధాకరం. భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతింటున్నా కేంద్రం ఎందుకు మౌనంగా చూస్తోంది అంటూ ప్రశ్నించారు. ‘తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ ఘటన ఫై ప్రధాని మోడీ స్పందించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భాంగా ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌ ఘటనపై ప్రధాని స్పందించారు. ఆ ఘటన భాధాకరమని, సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ఇటువంటి అమానవీయ ఘటనకు పాల్పడిన నిందితులను ఉపేక్షించే పరిస్థితి లేదని అన్నారు. మణిపూర్‌ రేపిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని కాపాడాలని అన్నారు. మణిపూర్‌లో దురాగతాలను కట్డడిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో రాజీపడొద్దని అన్నారు.