సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు మరింత వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను టిఆర్ఎస్ , బిజెపి పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికలతో హ్యాట్రిక్ కొట్టాలని టిఆర్ఎస్ చూస్తుంటే..ఆ ఛాన్స్ ఇవ్వద్దోదని బిజెపి చూస్తుంది. ఇప్పటికే టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తుంది.

దీంతో సీఎం కేసీఆర్ ముందస్తు గా జనాల్లోకి వెళ్తున్నారు. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీన కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని , టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో
మంత్రి కొప్పుల ఈశ్వర్.. జిల్లా కేంద్రంలో అధికారులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పరిశీలించారు.