రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు..కీలక వ్యాఖ్యలు చేసారు. ‘ఇక చాలు.. రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటా’ నని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని , తాను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, నాలుగు దశాబ్దాలపాటు కొనసాగానని పేర్కొన్నారు. ఇక విశ్రాంతి తీసుకుంటానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సీఎం జగన్‌కు చెప్పినట్లు నిన్న శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో అన్నారు.

పార్టీ కోసం పనిచేస్తాను కానీ ఎక్కువ కష్టపడలేనని, తనను వదిలేయాలని కోరానని అన్నారు. అయితే, జగన్ మాత్రం ఈ ఒక్కసారికి పోటీ చేయాలని చెప్పారని గుర్తు చేసారు. తాను 12 సార్లు పోటీచేసి ఆరుసార్లు విజయం సాధించానని, గెలుపోటములతో పెద్దగా తేడా ఉండదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే గెలిచి మీ సేవకుడిగా ఉంటానని, ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని తెలిపినట్లు ధర్మాన తెలిపారు.