హైదరాబాద్‌లో ముస్లిం సంఘాల మిలియన్‌ మార్చ్‌

సీఏఏ, ఎన్నార్సీల పై నిరసన వ్యక్తం చేస్తున్న ముస్లిం సంఘాలు

million march in hyderabad
million march in hyderabad

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ పౌర సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లపై వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ హైదరాబాద్‌లో శనివారం ముస్లిం సంఘాలు మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ లో జరిగే సభకు నగరంలో పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరిలివెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, నుంచి ట్యాంకు బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముస్లిం సంఘాలు మిలియన్‌ మార్చ్‌ నిర్వహించేందుకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/