ఈ నెల 31 న మునుగోడు లో బిజెపి భారీ బహిరంగ సభ

BJP will hold a huge public meeting in Munugodu

మునుగోడు ఉప ఎన్నిక వేడి మాములుగా లేదు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు మునుగోడు లోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ నెల 31 న మునుగోడు లో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సభ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ జెపి నడ్డా కానీ హాజరుకాబోతారని అంటున్నారు. మరోపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ సైతం ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి జాతీయ స్థాయిలో గెలుపు సత్తా చూపించాలని పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తుంది.

గత 20 రోజులుగా టిఆర్ఎస్ నేతలంతా మునుగోడు లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరోపక్క ఈ నెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో ప్రచారంలో పాల్గొనబోతారని సమాచారం. ఈ ఉప ఎన్నిక పోటీ బిజెపి – టిఆర్ఎస్ మధ్యనే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోతుంది. కేవలం స్థానిక నేతలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అగ్ర నేతలంతా కూడా రాహుల్ యాత్ర పైనే ఫోకస్ చేయడం ..మరోపక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం మునుగోడు లో కాంగ్రెస్ గెలవదని పబ్లిక్ గా చెపుతుండడం తో కార్య కర్తలు సైతం కాస్త అయోమయంలో పడిపోతున్నారు.