ట్రంప్‌పై మిషెల్ ఒబామా ఘాటైన వ్యాఖ్యలు
ట్రంప్ ఓ అసమర్థ అధ్యక్షుడు
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఓ అసమర్థ అధ్యక్షుడు అని ఆమె విమర్శించారు. అతనిలో ఎటువంటి సానుభూతి కూడా లేదని ఆమె అన్నారు. డెమోక్రటిక్ కన్వెన్షన్‌లో పాల్గొన్న మిషెల్ మాట్లాడుతూ.. సమర్థమైన నాయకత్వం, ఓదార్పు, స్థిరత్వం కోసం శ్వేతసౌధం వైపు చూస్తే.. అక్కడ వాతావరణం ఆందోళనకరంగా, విభజనాత్మకంగా, ఎటువంటి సానుభూతి లేకుండా ఉందని ఆమె విమర్శించారు. నిజాయితీతో మీకు ఒక విషయాన్ని చెబుతానని, ట్రంప్ మన దేశానికి సరైన అధ్యక్షుడు కాదని ఆమె అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/