ఎమ్మెల్సీగా పెన్మత్స ఏకగ్రీవంగా ఎన్నిక

పెన్మత్స ఒక్కరే నామినేషన్ వేసిన వైనం

penmatsa-suryanarayana-raju-elected-as-mlc-unanimously

అమరావతి: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్‌ఆర్‌సిపి నేత పెన్మత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఓ ప్రకటన చేశారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు మరణించగా, ఆయన కుమారుడు సూర్యనారాయణ రాజుకు పార్టీ హైకమాండ్ చేయూతనిచ్చింది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నిక కోసం పెన్మత్స సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయినట్టు ఎన్నిలక అధికారి పేర్కొన్నారు. దాంతో శాసనమండలిలో వైసీపీ బలం 11కి పెరిగింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/