ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసు జారీ

ఉద్యోగుల సంఘం చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం

ap state logo
ap state logo

అమరాతిః ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిసి తమ సమస్యలు నివేదించడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసు జారీ చేసింది.

సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. ఉద్యోగుల వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని తెలిపింది. ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు గవర్నర్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/