మీనా భావోద్వేగంతో లేఖ విడుదల చేసారు

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యాసాగర్ చెన్నైలో మృతి చెందారు. అయితే ఆయన మృతి ఫై సోషల్ మీడియా లో అనేక రకాల వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో మీనా భావోద్వేగంతో లేఖ విడుదల చేసారు.

”భర్త దూరమయ్యారనే బాధలో నేనున్నా. దయచేసి మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. పరిస్థితి అర్థం చేసుకోండి. నా భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి అసత్య ప్రచారాలు ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు సహాయం చేసినవారు, మా కుటుంబానికి తోడుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా భర్త ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించిన వైద్య బృందం, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, మా స్నేహితులు, మీడియాకు ధన్యవాదాలు. నా భర్త త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు. వారి ప్రేమకు ధన్యురాలుని” అని మీనా లెటర్ లో పేర్కొంది.